Tuesday, 28 July 2026 02:49:03 PM

మతి స్థిమితం లేని అనాధ మహిళను సురక్షిత ప్రదేశానికి చేర్చాలి....

ఫిర్యాదు పై స్పందించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష... హర్షం వ్యక్తం చేసిన స.హ.చట్టం కార్యకర్త సోషల్ వర్కర్ బొబ్బిలి సత్యనారాయణ

Date : 25 March 2025 03:26 PM Views : 503

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎం.బి.ఫంక్షన్ హాల్ ముందు గత నెల రోజులుగా అక్కడే ఉండడాన్ని గమనించిన స.హ.చట్టం కార్యకర్త సోషల్ వర్కర్ బొబ్బిలి సత్యనారాయణ తన స్నేహితులు మంథని వెంకటేశ్వర్లు, ఐతే లక్ష్మీ నర్సయ్య లతో కలసి ఈనెల 19వ తేదీన నేరుగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను కలిసి గుర్తు తెలియని సుమారు 25 నుంచి 30 సంవత్సరాలు కలిగిన మహిళ మానసిక స్థితి బాగా లేకుండా ఉండటంపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. మహిళకు రక్షణ కల్పించాలని, ఈ మహిళను ఏదైనా ప్రభుత్వ వసతి గృహం కు , సురక్షిత ప్రదేశాన్ని చేర్చాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. అయితే దీనిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించడంతో సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ స్వప్న తమ సిబ్బందితో వచ్చి ఆ మానసిక స్థితి బాగా లేని మహిళను సఖి సెంటర్ కు తరలించారు. ఈ సందర్భంగా బొబ్బిలి సత్యనారాయణ మాట్లాడుతూ... తాను తన మిత్రులు మంథని వెంకటేశ్వర్లు , ఐతే లక్ష్మీ నర్సయ్య కలిసి ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కి , జిల్లా సంక్షేమ అధికారులకు సఖి సెంటర్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ మతిస్థిమితం లేని అనాధ మహిళను సఖి సెంటర్ కు చేర్చిన తర్వాత అక్కడ నుండి అమ్మానాన్న అనాధ ఆశ్రమం చౌటుప్పల్ , యాదాద్రి భువనగిరికి తరలిస్తామని సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ స్వప్న తెలిపినట్లు ఆయన అన్నారు. సురక్షిత ప్రదేశానికి చేర్చి ఆమె మానసిక స్థితిని ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని భద్రత రక్షణ కల్పించు ప్రదేశంలోకి పంపించాలని బొబ్బిలి సత్యనారాయణ కలెక్టర్ ను కోరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :