ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ఎన్టీపీసీ అధికారులు తూతూ మంత్రంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి పోలీస్ నిర్భంధాలను కొనసాగించారని ఎన్టీపీసీ అధికారుల తీరుపై ప్రధాని, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని బిజెపీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జీ కందుల సంధ్యారాణి అన్నారు. ఈ మేరకు సంధ్యారాణి మాట్లాడుతూ ఎన్టీపీసీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం తూతూ మంత్రంగా చేపట్టారని విమర్శించారు. పోలీసు నిర్బంధంలో అధికారులు చేతులు దులుపుకున్నరని అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో బీజేపీ మహిళా నేత అయిన నాకు మైక్ ఇవ్వకుండా అవమానించారని తెలిపారు.కార్యక్రమం చివరి సమయంలో ఎవరు లేని సందర్భంలో నియోజకవర్గ స్థాయి మహిళా నేతను పిలవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. సమస్యలు, డిమాండ్లు తెలియజేసే హక్కు కల్పించని అధికారులు స్థానికులకు న్యాయం చేస్తామంటే ఎలా నమ్మాలి అని ప్రశ్నించారు. తాత్కాలికంగా అడ్డుకున్న ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం ఆగదని స్పష్టం చేశారు.స్థానికులకే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.అత్యధిక సిఎస్ఆర్ నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేయాలని అన్నారు. విద్యా, వైద్యం నిరంతరం కొనసాగాలని అన్నారు. ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ హియరింగ్ రిపోర్ట్ ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.గతంలో ఏర్పాటు చేసిన ప్లాంట్ విషయంలో ఎన్టీపీసీ యాజమాన్యం రైతులకు ఇచ్చిన మాట తప్పిందని విమర్శించారు. యాజమాన్య మానసరిస్తున్న నియంతృత్వ పోకడల వల్ల వందలాది మంది రైతులు నష్టపోయే పరిస్థితిలు నెలకొన్నాయని ఎన్టీపీసీ యాజమాన్యం వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో రైతులను గ్రామస్తులను స్థానికులను అనుమతించకుండా నిర్బంధాలను కొనసాగిస్తూ మొండి వైఖరి కొనసాగించడంపై సంధ్యారాణి మండిపడ్డారు. మళ్లీ భూసేకరణ పేరుతో ధగా చేసేందుకు ఎన్టీపీసీ యాజమాన్యం మరో ఎత్తుగడ్డ వేసిందన్నారు. యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలను రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎన్టీపీసీ యాజమాన్యం ప్రజా సేకరణ ఏ విధంగా చేపడుతుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా తమ తీరును మార్చుకొని ప్రజా ఆకాంక్షల కనుగుణంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి ప్రజల హామీలను నెరవేర్చాలని సంధ్యారాణి డిమాండ్ చేసారు. మరోవైపు ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని జిల్లా కలెక్టర్ స్థానిక రైతులకు ప్రజలకు తెలపడంతో తమ సమస్యలను విన్నవించడానికి వినతిపత్రాలతో కలెక్టర్ వద్దకు వెళుతున్న సమయంలో పోలీసులు ఆపివేసి తమ వద్ద ఉన్న వినతి పత్రాలను లాక్కొని ఇష్టానుసారంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా ఎన్టిపిసి యాజమాన్యం భూ నిర్వాసితులకు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం విద్య ఉద్యోగ అవకాశాలను కల్పించాలని సంధ్యారాణి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
Admin
Aakanksha News