ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : వరంగల్ జిల్లా ఎల్కుతుర్తిలో ఈనెల 27వ తేదీన జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గోదావరిఖని 5వ ఇంక్లైన్ పట్టణ కమిటీ ముఖ్య నాయకుల సమావేశం 12 వ డివిజన్ వినాయక మండపంలో నిర్వహించారు , పట్టణ అధ్యక్షులు బొడ్డు రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసన సభ్యులు కోరకంటి చందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు మన రామగుండం నుంచి సుమారు 5 వేల పైగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుందని అన్నారు. నాయకులు కార్యకర్తలు అందరం కలిసికట్టుగా పెద్ద ఎత్తున వెళ్లి ఈ కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు , ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు 12వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్, 13వ డివిజన్ మాజీ కార్పొరేటర్ రాకం లతా దామోదర్ 34 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ జంజర్ల మౌనిక రాజు 33 డివిజన్ మాజీ కార్పొరేటర్ బొబ్బిలి సతీష్ కుమార్ మాజీ కార్పొరేటర్ నారాయణదాసు మారుతి ,మాజీ కౌన్సిలర్ కుడుదుల శ్రీనివాస్ , నాయకులు చీకట్ల లక్ష్మయ్య, లక్ష్మీరాజం, మేకల నవీన్, రాస మల్ల విజేందర్, బుర్రి వెంకటి , బొడ్డు రాజేశం, గాండ్ల సునీల్ ధరణి రాములు పోరండ్ల నారాయణ , దుస్స వెంకటేష్ , ఎర్రోళ్ల రాజు , లంక దాసరి హరికృష్ణ, రామరాజు అనుమల శంకర్ ,గుంషావలి , శ్రీహరి, శ్రీనివాస్ , డిష్ రవి తదితరులు పాల్గొన్నారు
Admin
Aakanksha News