ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 27 వ తేదీన నిర్వహించే రజతోత్సవ సభకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని వివిధ ఆటో యూనియన్ అడ్డాల నాయకులు రూ.50వేల విరాళాన్ని రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ కు నగదును అందజేశారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇతర రాష్టాలకు ఆదర్శనంగా నిలిచారని పేర్కొన్నారు. అలాగే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ఎంతో కృషి చేసారని తెలిపారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్టాన్ని సాధించి తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసారని అన్నారు. ఈ కార్యక్రమంలో నీలారపు రవి, రేణిగుంట్ల సురేశ్, ఆయుధాల సదానందం, పసుపుల విజయ్‌కుమార్, మాతంగి సురేశ్, కనుకుంట్ల రాజేందర్, నారమళ్ల అనిల్, నేతగాని శ్రీనివాస్, అన్నారపు నరేందర్, రాచర్ల రవీందర్ ఉన్నారు.
Admin
Aakanksha News