ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / యైటింక్లెయిన్ కాలనీ (గోదావరిఖని) : సింగరేణి సంస్థ రామగుండం రీజియన్-2 డివిజన్ లో మంగళవారం కార్మికుల సౌకర్యార్థం నిర్వహించిన క్వార్టర్ కౌన్సిలింగ్ సజావుగా సాగింది.స్థానిక సీఈఆర్ క్లబ్ లో నిర్వహించిన కౌన్సెలింగ్ లో ఆర్జీ-3 జీఎం ఆఫీస్ లో, ఓసిపి-2 లో, ఏ ఎల్ పీ లో పని చేస్తూ ఇప్పటివరకు క్వార్టర్ లేని, చేంజ్ ఆఫ్ కొరకు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు పాల్గొన్నారు. 969 క్వార్టర్స్ కి గను 136 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా 56 మంది ఉద్యోగులు కౌన్సెలింగ్ కు హాజరై..44 మంది క్వార్టర్స్ ను అల్లోట్ చేసుకున్నారు.ఈ కౌన్సిలింగ్ లో ఎస్వోటూ జీఎం మలోతు రాముడు, డిజిఎం( పర్సనల్ ), ఏరియా అధికార ప్రతినిధి ఎస్.అనిల్ కుమార్, డివైపిఎం వేణుగోపాల్,సివిల్ ఈఈ ప్రతపగిరి రాజు, గుర్తింపు సంఘం ఏఐటియుసీ ఆర్జీ-2 ఏరియా బ్రాంచ్ సెక్రటరీ జిగురు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News