Thursday, 11 June 2026 11:46:10 PM

రామగుండం 1 ఇంక్లైన్ గనిలో గనిలో కార్మికుల బైఠాయింపు....

అర్జీ-1 జీఎం వచ్చి సమస్య పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామన్న కార్మికులు...

Date : 09 February 2026 11:21 AM Views : 492

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రామగుండం రీజియన్ పరిధిలోని అర్జీ-1 ప్రాంతం, 1 ఇంక్లైన్ గనిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అదే గనిలో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా కార్మికురాలు, అక్కడే పనిచేస్తున్న ఒక అధికారిని అవమానపరిచే రీతిలో మాట్లాడిందని ఆరోపిస్తూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు నిరసనగా ఉదయం మొదటి షిఫ్ట్‌లో కార్మికులు గనిపై బైఠాయించి నిరసన తెలిపారు.గనిలో పనిచేసే కార్మికులను బెదిరించే ధోరణి కొనసాగుతోందని, అధికారుల వైఖరి సరికాదని కార్మికులు ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అర్జీ-1 ప్రాంత జనరల్ మేనేజర్ (జీఎం) స్వయంగా గనికి వచ్చి సమస్యను పరిష్కరించే వరకు తమ ఆందోళనను విరమించేది లేదని కార్మికులు స్పష్టం చేశారు.నిరసన కారణంగా గనిలో పని తాత్కాలికంగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కార్మికులతో చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. అయితే ఉన్నతాధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని కార్మికులు పట్టుబట్టారు. పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతోంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :