ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : కాంగ్రెస్ పార్టీ అవినీతి పరులకు మద్దతు ఇస్తూ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని,ప్రభుత్వ తప్పుడు పనులకు కళ్లెం వేయాలంటే అది బిజెపి పార్టీతోనే సాధ్యమవుతుందని బిజెపి పార్టీ జాతీయ నాయకులు అల్జాపురం శ్రీనివాస్ విమర్శించారు. ఈ సందర్బంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీలోని బిజెపి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డితో కలసి ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ.. కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బిసీలను తక్కువగా చేసి చూపించే ప్రయత్నం చేసిందని దీంతో పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత రావడంతో వెంటనే ప్రభుత్వం చేసిన తప్పును సరిద్దిద్దుకునేందుకు మల్లి కులగణన సర్వే చేపడుతుందని అన్నారు. బిజెపి పార్టీ నుండి గెలిచినా ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన పోరాటం నిర్వహిస్తున్నారని అన్నారు. అలాగే కౌన్సిల్ లో ప్రభుత్వ ఉద్యోగులు,నిరుద్యోగ సమస్యలతో పాటు ప్రభుత్వాన్ని నిలదీయాలంటే బిజెపి అభ్యర్థులు కొమురయ్య, అంజిరెడ్డి లను గెలిపించాలని పిలుపునిచ్చారు. సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే వారి పార్టీని ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని నిలదీసే పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. ఇప్పటికే రేవ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నవ్వులపాలు అవుతుందని ఆరోపించారు. అసెంబీలో, ప్రజా సమస్యలపై నిలదీసి కొట్లాడే వారు ఉండాలని జీ హుజూర్ అనే వారు కాదని అన్నారు. సొంత పార్టీలోనే అంతర్మధనం కొనసాగుతోందని తెలిపారు. అలాగే విదేశాల్లో నిధులు తీసుకవస్తున్నామని చెప్తున్నారు కానీ వాటికి సంబందించిన డిపిఆర్ లను మాత్రం చూపించడం లేదన్నారు. ఇప్పటికే కోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన కూడా ఎటువంటి మార్పు రావడం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో రామగుండం నియోజకవర్గ ఇంచార్జి కందుల సంధ్యారాణి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News