Friday, 12 June 2026 01:38:31 AM

మైసమ్మ ఆలయాల కూల్చివేత ఘటనపై నేను నిశ్శబ్దంగా ఉండను.. మైసమ్మ ఆలయాల కూల్చివేతపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆవేదన...

భక్తుల నమ్మకాన్ని కాపాడటానికి అన్ని స్థాయిల్లో పోరాటం చేస్తాను...

Date : 08 November 2025 05:34 PM Views : 405

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : గోదావరిఖనిలో భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా మైసమ్మ తల్లి ఆలయాలను మున్సిపల్ అధికారులు కూల్చి వేయడంపై పెదపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 48 మైసమ్మ ఆలయాలను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడం భక్తుల విశ్వాసాన్ని అవమానపరచే చర్యగా ఆయన పేర్కొన్నారు.ఈ ఘటనను ఆయన భక్తుల ఆధ్యాత్మిక భావజాలంపై దాడిగా పేర్కొంటూ ప్రజల సాంస్కృతిక విలువలను అవమాన పరచే విధంగా అధికారులు వ్యవహరించడం తీవ్రమైన తప్పు అని సాంప్రదాయంగా ప్రజలు పూజించే దేవాలయాలను నాశనం చేయడం చట్టపరంగా నైతికంగా సమర్థించదగినది కాదని గడ్డం వంశీకృష్ణ అన్నారు.ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా జిల్లా ఇంచార్జీ మంత్రి శ్రీధర్ బాబు తక్షణం స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలను గౌరవించడం ప్రభుత్వ ప్రథమ బాధ్యత. ఈ విషయంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండవని ఆయన హెచ్చరించారు. మైసమ్మ ఆలయాల కూల్చివేతతో గోదావరిఖని ప్రజల్లో నెలకొన్న ఆవేదనను అర్థం చేసుకుని, బాధ్యులైన అధికారులపై తక్షణ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కోరారు.అలాగే గడ్డం వంశీకృష్ణ గోదావరిఖని ప్రజలకు భరోసా ఇస్తూ ఈ ఘటనపై నేను నిశ్శబ్దంగా ఉండను. భక్తుల నమ్మకాన్ని కాపాడటానికి అన్ని స్థాయిల్లో పోరాటం చేస్తానని పేర్కొన్నారు.స్థానిక ప్రజలు, హిందూ సంఘాలు ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలను స్వాగతిస్తూ, తమ ఆవేదనకు ఆయన అండగా నిలుస్తున్నారని అభినందించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :