Tuesday, 28 July 2026 09:50:20 AM

సీఐ ఇంద్రాసేనా రెడ్డి తన తీరును మార్చుకోవాలి...

గతంలో జరిగిన ఘటనలు మళ్లీ పునరావృతం చేసుకోవద్దు.... న్యాయవాదుల డిమాండ్

Date : 27 February 2025 08:38 PM Views : 1126

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / పెనుగొండ సతీష్ : ఒక్కటవ పట్టణ సీఐ ఇంద్రసేనారెడ్డి దురుసు ప్రవర్తనను నిరసిస్తూ అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలు) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చందాల శైలజ ఆధ్వర్యంలో న్యాయవాదులు మున్సిఫ్ కోర్టు కాంప్లెక్స్ ఎదుట నిరసన తెలిపారు ,ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ... బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీఐ న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించడం హేయమైన చర్య అని అన్నారు. ఈ నెల 19 నా మైనర్ బాలుడిని పోలీసులు తీసుకెళ్తే అడిగినందుకు వెళ్లిన న్యాయవాదిపై ఈ విధంగా మాట్లాడడం సీఐకి తగదని గతంలో ఇదే విధంగా ప్రవర్తించి న్యాయవాదుల సమక్షంలో క్షమాపణ చెప్పిన సీఐ తిరిగి ఇదే విధంగా ప్రవర్తించడం దారుణం అన్నారు. ఇప్పటికైనా సీఐ తన ప్రవర్తను మార్చుకోవాలని పోలీస్ స్టేషన్ లకు వచ్చే న్యాయవాదులతో పాటు సామాన్య ప్రజలు సైతం న్యాయం కోసం వస్తారని..అలా వచ్చిన వారిపై దురుసుగా ప్రవర్తించరాదన్నారు. ఇప్పటికైనా సీఐ తన తీరును మార్చుకోవాలని లేనట్లయితే ఆయన బదిలీ అయ్యేంతవరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఉమర్ ,టౌన్ అధ్యక్షులు ఆసంపల్లి రవీందర్ కార్యదర్శి రామ టెంకి శ్రీనివాస్ ,కోశాధికారి షానా వాజ్,శ్రీలత. రేష్మ తో పాటు సీనియర్ జూనియర్ న్యాయవాదులు సీతకారి చంద్రశేఖర్, గుడికందుల భూమయ్య , సానం మురళిచెలికల శ్రీనివాస్ ,దాదా సలాం , పులిపాక రాజ్ కుమార్ ,రజిత ,తిలక్ తదితరులు ఉన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :