Tuesday, 28 July 2026 08:55:40 AM

సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నం...

అడ్డుకున్న పోలీసులు...

Date : 02 September 2025 06:30 PM Views : 521

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : ఓదెల మండలం గుంపుల గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఐరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోత్కపల్లి పోలీసులు వచ్చి అడ్డుకోవడం జరిగింది. దిష్టిబొమ్మనూ గుంజుకొని తీసుకెళ్లడం జరిగింది.అరగంటసేపు రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది.తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టుపై అబద్ధపు అసత్య ప్రచారాలు చేస్తూ కమిషన్ల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తూ ఉండడం కాలేశ్వరం కేసును సిబిఐ కి అప్పగించడాన్ని నిరసిస్తూ మంగళవారం రోజు దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి ప్రధాన సమస్య రైతాంగానికి యూరియా కొరత వెంటనే తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి,మాజీ జడ్పిటిసి గంట రాములు యాదవ్,మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్,ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి,ఆళ్ల రాజిరెడ్డి, మాజీ సర్పంచులు చిరంజీవి,రాజుగౌడ్,శ్రీనివాస్, ఎల్లస్వామి,కొమురయ్య మాజీ ఎంపిటిసిలు జీల తిరుపతి,గట్టు శ్రీనివాస్,కిషన్ రెడ్డి నాయకులు సురేష్ గౌడ్,మధుసూదన్ రెడ్డి,రాజు, శ్రీనివాస్,కుమార్, పర్శరాములు,రంజిత్, గడ్డం అజయ్, వినయ్, కుమారస్వామి, జీల రాజు, రాజ్ కుమార్, కిరణ్,సంపత్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :