ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : మూడు దశాబ్దాల క్రితం జరిగిన కరసేవ ఇక్కడి ఎందరో జాతీయ వాదులకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని రామగుండం నియోజకవర్గ బిజెపి పార్టీ ఇంచార్జీ కందుల సంధ్యారాణి అన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ లక్ష్మీ నగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో బిజెపి ఆవిర్భవ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం జెండా ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ.... అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేయాలనే సంకల్పంతో 35 సంవత్సరాల క్రితం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం నుండి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎన్నో కష్టాలను ఓర్చుకొని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యకు బయలుదేరి కర సేవలో పాల్గొన్న సంఘ్ పరివార్ క్షేత్ర కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. నేడు బిజెపి పార్టీ అధికారంలో ఉంది అంటే ఎంతోమంది కర సేవకులు చేసిన ప్రాణ త్యాగమే అని కొనియాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి వెళ్లిన మూడు బృందాలలో ఒక బృందానికి నాయకత్వం వహించే అవకాశం రావడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. నెల రోజులపాటు 800 కిలోమీటర్లు నడిచి అయోధ్య దగ్గరలోని ప్రతాపఘడ్ ప్రాంతానికి చేరుకోవడంతో ఉత్తరప్రదేశ్ మైదానాలు జైలుగా మారాయని అక్కడి ప్రభుత్వం కరసేవకులను ఎన్నో ఇబ్బందులు పెట్టిన కాల్కులకు తెగబడిన రామ మందిరం నిర్మాణమే సంకల్ప లక్ష్యంతో కార్యకర్తలు కదం తొక్కి ముందుకు సాగారని ఈ సందర్భంగా వారు చేసిన త్యాగాలను ధైర్య సాహసలను సంధ్యారాణి కొనియాడారు. లక్ష్మీ నగర్ మండల అధ్యక్షుడు కోడూరి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మెరుగు హనుమంత్ గౌడ్, కర సేవకులు ఈసంపల్లి వెంకన్న, గిరిధర్ లాల్ రాటి, విజయగిరి వెంకటేశ్వర్లు, నీలం తిరుపతి. వేముల చంద్రమౌళి. గోగుల రవీందర్ రెడ్డి. మడికొండ శ్రీనివాస్. కుంబాల రాజు. నీలం శ్రీనివాస్. నీలం రవి. చెల్పూరి సత్యనారాయణ. నీలం రాధక్క. పుక్కాడపు మురళి. అరవేణ సత్యనారాయణ. వెలగం లక్ష్మీనారాయణ. నరసింహస్వామి. తదితరులతో పాటు బిజెపి జిల్లా నాయకులు ముసుగుల భాస్కర్ రెడ్డి. కోమల మహేష్. అపర్ణ. రాకేష్. అందే రాజకుమార్. మెరుగు శ్రీనివాస్. ఉష. గంధం అజయ్.పెండ్యాల రఘు, జక్కన్న బాలకృష్ణ. రాకేష్. మేకల ఆమని. ఆకాష్. సుహాని. మహేష్. అరుంధతి వంశీ తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News