Friday, 12 June 2026 01:35:14 AM

ట్రైన్ నుండి కింద పడిన వ్యక్తిని ప్రథమ చికిత్సతో కాపాడిన బ్లూకోల్ట్ సిబ్బంది...

Date : 05 June 2025 08:42 PM Views : 744

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల పరిధిలోని పోత్కపల్లి 29వ రైల్వే గేట్ సమీపంలో గురువారం విషాదం నెలకొంది. దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ నుండి గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోవడంతో ఆయనకు తీవ్ర గాయాలపాలయ్యారు.వెంటనే సమాచారం అందుకున్న పొత్కపల్లి ఎస్సై డికొండ రమేష్ ఆదేశాల మేరకు బ్లూకోల్ట్ సిబ్బంది శంకర్, శివశంకర్‌లు ఘటనాస్థలికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి తక్షణమే ప్రథమ చికిత్స అందించారు. అనంతరం 108 అంబులెన్స్ ద్వారా అతన్ని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.సమయస్పూర్తితో స్పందించి, ప్రమాద స్థితిలో ఉన్న వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి చేర్చిన బ్లూకోల్ట్ సిబ్బంది సేవలను పొత్కపల్లి ఎస్సై రమేష్ ప్రశంసించారు. స్థానిక గ్రామస్తులు కూడా వారిని అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు.ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల చొరవ ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతోందని స్థానికులు అభిప్రాయపడ్డారు. జనజీవిత రక్షణలో బ్లూకోల్ట్ వ్యవస్థ మరింత ప్రభావవంతంగా పనిచేస్తోందని ఈ ఘటన మరోసారి రుజువైంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :