Tuesday, 28 July 2026 03:51:14 AM

గుంజపడుగు, రచ్చపల్లి పోలింగ్ కేంద్రాలను సందర్శించిన డీసీపీ రామ్‌రెడ్డి...

Date : 11 December 2025 09:04 AM Views : 471

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లాలో నేడు జరుగుతున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్‌తో కలిసి మంథని మండలంలోని గుంజపడుగు, రచ్చపల్లి పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో అమలు చేసిన బందోబస్తును, ఏర్పాటు చేసిన మౌలిక వసతులను డీసీపీ స్వయంగా పరిశీలించారు. ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు చేసిన ఏర్పాట్ల గురించి అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది, ఎన్నికల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.కేంద్రాల వద్ద ప్రజల రాకపోకలు, భద్రతా చర్యలు, క్యూ లైన్ వ్యవస్థ, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలపై డీసీపీ క్లూస్ తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ… “ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నాం. ఓటర్లు నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు.పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని మోహరించినట్లు, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :