Wednesday, 29 July 2026 06:57:06 AM

ట్రూ ఫిట్ జిమ్ సెంటర్ సందర్శించిన బిగ్ బాస్ ఫేం,....

Date : 11 June 2025 06:40 AM Views : 801

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ఎఫ్‌సీఐ ప్రాంతంలోని ట్రూ ఫిట్ జిమ్ సెంటర్‌ను మంగళవారం ప్రసిద్ధ సినీ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ గారు సందర్శించారు. జిమ్ పరిసరాలను పరిశీలించిన ఆయన, అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్, శుభ్రత మరియు సమర్థవంతమైన సదుపాయాలపై ప్రశంసలు కురిపించారు.ఈ సందర్భంగా సోహైల్ మాట్లాడుతూ – “యువత ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇలాంటి ఆధునిక జిమ్‌లు ఎంతో అవసరం. ట్రూ ఫిట్ జిమ్ అందిస్తున్న సదుపాయాలు నిజంగా ప్రోత్సాహకరంగా ఉన్నాయి” అని అన్నారు.జిమ్ యాజమాన్యం తరఫున అతిథిగా విచ్చేసిన ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిమ్ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనతో సెల్ఫీలు దిగారు, ముచ్చటించారు.ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు.అందులో ఎసిపి ప్రతాప్, బీజేపీ రామగుండం ఇంచార్జి కందుల సంధ్యారాణి, ఎన్సీపి రాష్ట్ర నాయకులు మేకల శ్రీధర్ యాదవ్, టిఆర్ఎస్ నాయకులు దాసరి రాయలింగు, జిమ్ నిర్వాహకులు ముజామిల్ తదితరులు ఉన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :