Tuesday, 28 July 2026 12:24:43 PM

50% సబ్సిడీపై అందుబాటులో జీలుగా విత్తనాలు...

మండల వ్యవసాయ అధికారి చిందం శ్రీకాంత్

Date : 20 May 2025 02:50 PM Views : 567

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / వరంగల్ జిల్లా : రామగిరి మండలంలో 50 శాతం సబ్సిడీపై జీలుగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి చిందం శ్రీకాంత్ తెలిపారు.ఏ ర్ స్ కే బేగంపేటలో 95 క్వింటాళ్లు, డిసిఎంసి కల్వచర్లలో 70 క్వింటాళ్లు, డిసిఎంసి సుందిళ్లలో 85 క్వింటాళ్ల జిలుగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. సబ్సిడీ పోను రైతు రూ. 2137.5 రూపాయలు చెల్లించాలన్నారు. పట్టాదారు పాస్ బుక్ ఆధార్ కార్డులు సమర్పించి పర్మిట్ పొంది విక్రయ కేంద్రాలలో విత్తనాలు తీసుకోవాలని రైతులకు సూచించారు. పచ్చి రొట్టె ఎరువులు అయినా జీలుగా విత్తనాల వాడటం వల్ల భూసారం పెంపొంది సేంద్రియ కర్బనం వృద్ధి చెంది నీటి నిలువ శాతం పెరగడం వల్ల అధిక దిగుబడి వస్తుందని తెలిపారు. అదేవిధంగా జీడిగా వాడటం వల్ల నత్రజని మొక్కకు అందుబాటులో ఉంటుందన్నారు. యూరియా వినియోగం తగ్గి పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని ఒక్క బ్యాగు 30 కేజీలు ఉంటుందని వివరాలకు వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :