Tuesday, 28 July 2026 07:04:27 AM

బెట్టింగ్ యాప్ లో మోసపోయి యువకుడి ఆత్మహత్య...

Date : 21 March 2025 07:35 PM Views : 698

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : బెట్టింగ్ ఆన్ లైన్ యాప్ లకు అలవాటు పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లా మంత్రి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన కొరవేణి సాయి తేజ అనే యువకుడు ఓ ప్రైవేట్ అస్పత్రిలో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లకు అలవాటు పడి ఆర్ధికంగా నష్టపోయి ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఈ నెల 18వ తేదీన సాయంత్రం 6గంటల ప్రాంతంలో మంథనిలోని సింగిరెడ్డి పల్లె గ్రామ శివారులో గడ్డి మందు తాగి తన స్నేహితుడు మోటం సాయి తేజకు ఫోన్ చేసి గడ్డి మందు తాగిన విషయం తెలపగా వెంటనే అతని స్నేహితులు అక్కడికి చేరుకొని గోదావరిఖని ప్రభుత్వ అస్పత్రికి తీసుకేళ్లాగా చికిత్స నిమిత్తం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తరలించారు. గత రెండు రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుని భార్య కొరవేణి దీపిక ఫిర్యాదు మేరకు గోదావరిఖని టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :