Tuesday, 28 July 2026 05:19:05 AM

బంధంపల్లి రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం....

= బైకులకు ఢీకొట్టిన కారు… ఒకరు అక్కడికక్కడే మృతి..

Date : 17 November 2025 01:07 PM Views : 533

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి పట్టణ పరిధిలోని బందంపల్లి రాజీవ్ రహదారిపై శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికులను కలచివేసింది. వేగంగా వచ్చిన కారు రెండు బైకులను ఢీకొట్టడంతో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, అతడిని వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పెద్దపల్లి టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కారు డ్రైవర్ వేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కారు డ్రైవర్ పరారీలో ఉండగా, అతడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :