ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు... ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విధంగా కాలేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని ఎత్తిపోసి చూపించాలని అయన డిమాండ్ చేశారు. వెంటనే కాలేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మత్తులు చేయించాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణను సస్యశ్యామలంగా తీర్చిదిద్దారని అలాగే అన్ని డ్యాములలో నీటిని నింపి తెలంగాణను సస్యశ్యామలంగా చేసి పంట పొలాలకు నిరంధించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ పై కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే కాలేశ్వరం ప్రాజెక్టు కు పరమతులు చేయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.
Admin
Aakanksha News