Friday, 12 June 2026 12:44:38 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల అడగడానికి వస్తే నిలదీయండి...

రజతోత్సవ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు... మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్..

Date : 28 April 2025 12:58 PM Views : 663

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడగడానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీసి అడగాలని రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన రజతోత్సవ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆరోజే కేసీఆర్ అన్నారని తెలిపారు. అలాగే ఈ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలని మావోయిస్టులతో చర్చలు జరపాలని పిలుపునిచ్చారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :