Tuesday, 28 July 2026 09:46:41 AM

భారతదేశ చరిత్రలో ఇదో చీకటి రోజు...

కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ మంజుల శ్రీనివాస్ రెడ్డి

Date : 14 February 2025 06:49 PM Views : 529

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ఫిబ్రవరి 14 భారతదేశ చరిత్రలో ఇదో చీకటి రోజు అని సరిగ్గా నాలుగేళ్ల క్రితం భారత భద్రతా బలగాలపై ఉగ్రవాదులు అత్యంత ఘోరమైన దాడులకు పాల్పడ్డారని కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ మంజుల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు దేశ రక్షణలో అమరులైన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు గోదావరిఖని మార్కండేయ కాలనీలోని కృష్ణవేణి పాఠశాలలో విద్యార్థులు ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..దేశ రక్షణలో ఎంతో మంది సైనికులు తమ ప్రాణాలను అర్పిస్తున్నారని దేశ రక్షణలో కీలక భూమిక పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఈ దాడి తర్వాత భారతదేశం అంతటా నిరసనలు, బంద్‌లు, కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయని దేశంలో ప్రతి ఒక్కరు అమరులైన జవాన్ల కోసం కన్నీటి పర్యంతం అయ్యారని అన్నారు. అనంతరం జవాన్లు చేసిన కృషిని సేవలను పలువురు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్స్ పాల్ రామకృష్ణ , ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :