Tuesday, 28 July 2026 06:05:36 AM

బీసీ బంద్ లో పాల్గొని పార్టీ నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయడానికి కృషి చేయాలి..

Date : 17 October 2025 09:08 PM Views : 314

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రాష్ట్రవ్యాప్తంగా బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు మద్దతుగా జరుగుతున్న ఈ బంద్‌కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు కూడా పూర్తి మద్దతు తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ — “బీసీలకు న్యాయం చేయగల ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీయే. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రజలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి” అని అన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :