Tuesday, 28 July 2026 08:22:10 AM

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి షాక్!

విచారణకు హాజరు కావాలని సిఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ

Date : 24 September 2024 09:08 PM Views : 414

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణకు హాజరు కావాలని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది.నేడు జరిగిన విచారణకు మత్తయ్య ఒక్కరే హాజరయ్యారు. రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ హాజరు కాలేదు. ఈడి కేసు విచారణలో, నిందితులు హాజరు కాకపోవడంపై నాంపల్లి ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. నేడు విచారణకు మినహాయింపు ఇచ్చేందుకు అంగీకరించింది. తదుపరి విచారణకు తప్పకుండా హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. వచ్చేనెల 16వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఆ రోజు సిఎం రేవంత్ సహా నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :