Tuesday, 28 July 2026 08:09:13 AM

ప్రముఖుల అందరి చూపు... సింహం పైనే...

పైరవీలతో చక్కర్లు కొడుతున్న నేతలు....

Date : 06 October 2023 11:03 AM Views : 802

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో రామగుండం నియోజకవర్గం లో రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే టికెట్ రాకపోతే నియోజకవర్గం నుండి బరిలో నిలిచేందుకు ఎవరికి వారు తమ స్థాయిలో పైరవీలను ముమ్మరం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రామగుండం నియోజకవర్గంలో సింహం గుర్తుపై ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో సింహం గుర్తుపై పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే ఇప్పుడు అదే గుర్తుపై పోటీ చేసేందుకు ప్రముఖ నాయకులందరూ చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తుంది. మొన్నటి వరకు బిజెపిలో ఉండి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యేతో పాటు జాతీయ పార్టీ తరపున ఎప్పటికప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తూ అధికారికంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఓ నాయకుడు తనకు అవకాశం కల్పించాలని దరఖాస్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మధ్య కాలంలో కార్మిక సంఘం నాయకుడిగా తనకే టికెట్ కేటాయించాలని ఈ మధ్య కాలంలో ఢిల్లీ స్థాయిలో అగ్ర నేతల దగ్గరికి వెళ్లి కలవడంతో సదరు నాయకుడికి టికెట్ వస్తుందో రాదో అనే సందేహంలో పడ్డట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సొంత పార్టీ నేతల నుండే విభేదాలు ఎదుర్కొంటున్న సదరు నాయకుడి తీరుపై మరి కొంత మంది నాయకులు సైతం అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో రాజీనామా చేసిన మహిళా నాయకురాలు సైతం ఆసక్తిని చూపిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏ క్షణంలో ఏ మలుపు తిరుగుతాయో అర్థం కాని పరిస్థితులు నెలకొంటున్నాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :