Tuesday, 28 July 2026 08:34:35 AM

కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీపై హైకోర్టు కీలక ఆదేశాలు..!

Date : 04 January 2024 09:16 PM Views : 474

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ఉన్న అడ్డంకి తొలగిపోయింది. అయితే, అభ్యర్థులకు గతంలో నాలుగు మార్కులు కలపాలని సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను.. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ గురువారం కొట్టివేసింది. నాలుగు వారాల్లో నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది ధర్మాసనం ఆదేశించగా.. 15,640 పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది.తెలంగాణలో సివిల్‌, ఏఆర్‌ తదితర 16,604 పోస్టుల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసి.. అర్హత పరీక్షలు నిర్వహించింది. ఇందులో 15,640 మంది అభ్యర్థులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 2023 ఏప్రిల్ 30న కానిస్టేబుల్ తుది రాత పరీక్షలను నిర్వహించిన పోలీస్‌ నియామక బోర్డు.. ఫలితాలను అక్టోబర్‌ 4న విడుదల చేసింది.అయితే, రాత పరీక్షలు నాలుగు ప్రశ్నలు వచ్చాయని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి ధర్మాసనం నియామకాలపై స్టే విధించింది. నాలుగు మార్కులు కలపాలని ఆదేశించింది. దీంతో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ జరిపిన బెంచ్‌.. ఇండిపెండెంట్ ఎక్స్‌పర్ట్‌ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :