Tuesday, 28 July 2026 12:21:35 PM

హిందు దేవాలయాలు, హిందు సంస్కృతి సాంప్రదాయాల పైన దాడులు చేస్తే సహించేది లేదు

శివసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. సుదర్శన్ హెచ్చరిక

Date : 17 October 2024 07:24 PM Views : 433

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ అమ్మవారి గుడిని శివసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. సుదర్శన్ శివసేన రాష్ట్ర అధికార ప్రతినిధి గణేష్ గౌటే సందర్శించారు. హిందూ దేవాలయాల మీద దేవత విగ్రహాల ల మీద దాడిని వారు తీవ్రంగా ఖందించారు.ఈ సందర్బంగా ఏ. సుదర్శన్ మాట్లాడుతూ రాబోయేటువంటి రోజుల్లో ఇందు దేవాలయాల మీద గాని హిందువుల పైన గాని ఇందు సంస్కృతి సాంప్రదాయాల పైన ఎవరైనా కించపరిచే విధంగా మాట్లాడిన దాడులు చేసిన శివసేన పార్టీ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరించారు. ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం నిజ నిర్ధారణ కమిటీని వెయ్యవలసిన అవసరం ఉంది రాష్ట్రవ్యాప్తంగా సనాతన ధర్మం మీద అందరూ కలిసికట్టుగా పోరాడ వలసిన సమయం ఆసన్నమైందన్నారు. అమ్మవారి గుడిని సందర్శించిన వారిలో సామాజిక కార్యకర్త వండర్నాథ్ మంజుల ధార్మిక సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :