Tuesday, 28 July 2026 01:26:14 PM

కార్పొరేట్ పాఠశాల ప్రిన్సిపల్ మాయాజాలం...

15 లక్షల రూపాయల ఫీజులను సొంతానికి వాడుకున్న ప్రిన్సిపల్

Date : 17 April 2023 10:33 AM Views : 672

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఓ కార్పొరేట్ పాఠశాల ప్రిన్సిపల్ ఘరానా మోసానికి తేరతీసింది. విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫీజుల రూపంలో అందిన కాడికి దండుకొని చేతులెత్తేసిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీలోని నారాయణ హై స్కూల్ లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే...గోదావరిఖని మార్కండేయ కాలనీలోని నారాయణ హై స్కూల్ లో ప్రిన్సిపల్ యాజమాన్యానికి తెలియకుండా సుమారు 100 మందికి పైగా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేల రూపాయల ఫీజులను వసూలు చేసి తన సొంతానికి వాడుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుండి 15 లక్షల రూపాయల వరకు వసూళ్లు చేసి యాజమాన్యానికి చెల్లించకుండా తన సొంత వాడుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపాల్ చేసిన నిర్వాకం వల్ల ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న సదురు ప్రిన్సిపల్ పై యాజమాన్యం ఆలస్యంగా స్పందించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే కొంత మంది తల్లిదండ్రుల నుండి కూడా అప్పుల పేరిట లక్షల రూపాయలను సదురు ప్రిన్సిపల్ తీసుకున్నట్లు తెలుస్తుంది.దీంతో ప్రిన్సిపాల్ పై గోదావరిఖని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏజీఎం చైతన్య ఫిర్యాదు చేయడంతో పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :