Friday, 12 June 2026 01:35:15 AM

సామాజిక సేవలో భాగంగా రెండు రోజుల పాటు ట్రాఫిక్ విధులు.....

Date : 09 November 2024 01:13 PM Views : 501

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : మద్యం సేవించి వాహనాలు నడిపిన 20 మంది మద్యం బాబులను పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. వారికి పెద్దపల్లి న్యాయమూర్తి మంజుల 20 మందికి జరిమానా విధించడంతో పాటు అత్యధికంగా మద్యం సేవించి వాహనం నడిపిన కమాన్ పూర్ కు చెందిన ఇందారపు రమేష్ కు సామాజిక సేవలో భాగంగా రెండు రోజుల పాటు ట్రాఫిక్ విధులను నిర్వహించాలని తీర్పునిచ్చారు. అయితే ఇందులో భాగంగా రమేష్ పెద్దపల్లి పట్టణంలో శనివారం ట్రాఫిక్ విధులను నిర్వహించారు.ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :