Wednesday, 29 July 2026 08:16:04 AM

అధికార ప్రచారార్థంలో పరమార్థం ...?

అధిష్టానం వద్ద పదవి వద్దు...టికెట్ కావాలని పట్టు పట్టిన మాజీ ఎమ్మెల్యే...?

Date : 25 October 2023 04:36 PM Views : 1205

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : గత రెండు రోజులుగా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణపై సోషల్ మీడియాలో రోజుకో విధంగా ప్రచారం కావడం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తుంది. అధికార ప్రచారార్థంలో అర్థం, పరమార్థం ఏంటో తెలియదు కానీ పెద్దపల్లి జిల్లాలో రాజకీయాలు రోజురోజుకు సంచలనంగా మారుతున్నాయి.దీంతో పాటు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు అందరినీ ఆసక్తికి గురి చేస్తుండడంతో పాటు గందరగోళ పరిస్థితులకు దారి తీస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, బీజేపీ పార్టీకి చెందిన కందుల సంధ్యారాణి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోమరపు సత్యనారాయణ ఇలా ఎవరికి వారు తమ ప్రచారాలను ముమ్మరం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కొంత సానుకూల పరిస్థితులు అనుకూలించడంతో ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన ప్రయత్నాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అయితే వీరితో పాటు బిజెపి పార్టీ నుండి కందుల సంధ్యారాణిని అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించడంతో తన ప్రచారాన్ని సైతం జోరుగా కొనసాగిస్తున్నారు. ఇలా గతంలో అధికార పార్టీలో ఉన్నవారే ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉండటం కొంతమేర నష్టాన్ని కలిగించే పరిస్థితులు ఉండటంతో దీనిపై అధిష్టానం సైతం దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో సిద్దిపేటలోని ఓ దాబాలో ప్రస్తుతం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కలిసినట్లు రామగుండంలో జోరుగా రాజకీయ చర్చ కొనసాగుతుంది. ఇది ఇలా ఉండగా అధిష్టానం నుండి మాజీ ఎమ్మెల్యేకు పిలుపు రావడం పట్ల మరింత రాజకీయ చర్చకు దారితీసింది. అయితే హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సమావేశమై రామగుండం రాజకీయాలపై చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే అధికార పార్టీకి మద్దతు ఇవ్వమని కోరిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే తనకు టికెట్ కేటాయించాలని ప్రపోజల్ పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. టికెట్ కాకుండా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని అధిష్టానం ఆఫర్ చేసినట్లు ప్రచారం సాగుతుంది. అయితే మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అక్కడే తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్సీ పదవి కాకుండా మరో రెండు కండిషన్లను పెట్టినట్లు సైతం ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న రాజకీయాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ రాజకీయ పరిణామలు ఎటు వైపు దారి తీస్తాయయో వేచి చూడాల్సిందే.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :