Tuesday, 28 July 2026 08:09:21 AM

సింగరేణి సూపర్ బజార్ అవకతవకల పై విచారణ చేపట్టండి.

బాధ్యులపై చర్యలు తీసుకోండి.

Date : 10 July 2023 08:46 PM Views : 662

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : సింగరేణి కార్మికులు బయటి మార్కెట్ లో సరుకులు ఇతర వస్తువులు అధిక ధరలకు కొనుగోలు చేస్తూ మోసపోతున్నందున సింగరేణిలో నడుస్తున్న సెంట్రల్ కో ఆపరేటివ్ సొసైటిని అప్పటి చైర్మన్ అండ్ ఎమ్.డి శ్రీ బి.ఎన్ రామన్ వాటిని సూపర్ బజార్లు గా మార్చి అన్ని నిత్యావసర వస్తువులు, ఇతర వస్తువులు కార్మికులకు సరసమైన ధరలకు అందే విధంగా సదుద్దేశ్యంతో ఏర్పాటు చేయడం జరిగిందని సింగరేణి సూపర్ బజార్స్ ఉపాధ్యక్షులు వంగ వెంకట్, డైరెక్టర్ మడ్డి ఎల్లా గౌడ్ లు పేర్కొన్నారు. సోమవారం సూపర్ బజార్ లలో జరుగుతున్న అవకతవకల పై కొత్తగూడెంలో సూపర్ బజార్ ఎం.డి.కి వినతి పత్రాన్ని అందించారు.అనంతరం వారు మాట్లాడుతూ.. గత కొంత కాలంగా నిత్యావసర వస్తువులు,ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కార్మికులకు అందించడంలో ఈ సూపర్ బజార్లు విఫలమౌతున్నాయని వారు ఆరోపించారు. కార్మికులకు నెలకు రూ.10 వేల క్రెడిట్ సౌకర్యం ఈ సూపర్ బజార్ లో కల్పించినప్పటికి నిత్యావసర వస్తువులు అందుబాటులో లేక కార్మికులు బయటి మార్కెట్ ను ఆశ్రయిస్తున్నారని వారు తెలిపారు. అంతేకాక సూపర్ బజార్ల మీద అధికార్ల, డివిజనల్ -మేనేజర్ల నిత్య పర్యవేక్షణ కొరవడడంతో సిబ్బంది తమ ఇష్టారీతిన వస్తువులను బయటకి అమ్ముకుంటున్నారని వారు ఆరోపించారు. కౌంటర్ల మీద ఉన్న నగదును కూడా అక్రమంగా వాడుకుంటున్నారని వారు తెలిపారు.వీటి మీద శ్రీరాంపూర్, రామక్రిష్ణాపూర్, బెల్లంపల్లి, గోదావరిఖని, భూపాలపల్లి ఏరియా సూపర్ బజార్లలో రూ. 80 లక్షల అవినీతి అక్రమాలు జరిగినట్లుగా ఆడిట్ రిపోర్టులు కూడా వెళ్ళడించాయని వీటి మీద ఉద్యోగులు పలు పిర్యాదులు మీకు చేయడం జరిగిందని పేర్కొన్నారు. సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని చెప్పే సింగరేణికి ఈ సూపర్ బజార్ల అవినీతి అక్రమాలు తలొంపులుగా మారాయని వారు తెలిపారు. గతంలో కూడా పలుమార్లు అవినీతి అక్రమాల మీద పిర్యాదులు చేసినప్పటికీ నేటికి ఎలాంటి చర్యలు తీసుకొనలేదని వారు తెలిపారు. ఇప్పటికైనా సూపర్ బజార్ల మీద దృష్టి సారించి కార్మికులకు సూపర్ బజార్ ద్వారా నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు నిత్యం అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకొనవలసిందిగా కోరుతున్నామని వారు వినతి పత్రం లో పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :