ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రిటైర్డ్ ఐఎఎస్ ను కేబినెట్ హోదాతో కూడిన తన ప్రధాన సలహాదారుడిగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు సంవత్సరాల కాలం పాటు పదవిలో కొనసాగనున్నారు.ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఐఎఎస్ అధికారి సోమేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
Admin
Aakanksha News