Wednesday, 29 July 2026 12:06:47 PM

విద్యా సంస్థల బంద్ కు పిలుపు...

Date : 11 July 2023 03:45 PM Views : 526

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : విద్యా సంస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం వామపక్ష పార్టీల విద్యార్థి సంఘాల నాయకులు బంద్ కు పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా సహాయక కార్యదర్శి ప్రీతం, పీడీఎస్ యూ జిల్లా ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్ లు మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో సంవత్సరాల తరబడి సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని వారు మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు, పక్క భవనాలు, విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్, షూలు, పార్టీ పుస్తకాలను అందించాలన్నారు. అంతే కాకుండా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలన్నారు. ఈ సమస్యలన్నిటిని దృష్టిలో పెట్టుకుని వెంటనే ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాలల యాజమాన్యాలు సహకరించాలని వారు కోరారు. ఈ సమావేశంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :