ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకో మలుపు తిరుగుతూ సంచలనంగా మారుతున్నాయి. ఈ రాష్ట్ర రాజకీయాలకు బిన్నంగా రామగుండం రాజకీయాలు సాగుతున్నాయి. ఓ వైపు తెలంగాణలో పాగా వేసేందుకు కాంగ్రెస్, బిజెపి రాష్ట్ర నాయకులు పాదయాత్రలు చేస్తుంటే దీనికి తోడు బిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ రాష్ట్ర రాజకీయాలను తీసిపోని విధంగా రామగుండం రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకొనున్నాయి. దీంతో రానున్న ఎన్నికలే లక్ష్యంగా తొలి పాలక వర్గానికి చెందిన ఓ మాజీ ప్రజా ప్రతినిధి పాదయాత్రను చేపట్టబోతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే తొలి పాలక వర్గం సమయంలో సదరు మాజీ ప్రజా ప్రతినిధి రామగుండం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు, ఇతర వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో కార్పొరేషన్ లోని 50 డివిజన్ లలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఏప్రిల్ మొదటి వారం నుండి కార్పొరేషన్ లోని 50 డివిజన్ లలో చేపట్టే పాదయాత్రపై సదరు మాజీ ప్రజా ప్రతినిధి తన అత్యంత సన్నిహితులతో చర్చించినట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పాదయాత్రకు సంబంధించిన ఫ్లెక్సీలను సైతం గోప్యంగా తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ పాదయాత్రతో అధికార పార్టీపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను తీసిపోని విధంగా... రామగుండం రాజకీయాలు కొనసాగడం కోస మెరుపు...
Admin
Aakanksha News