ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : మంద కృష్ణ మాదిగ రేవంత్ రెడ్డి మీద మాట్లాడే అర్హత లేదని కాంగ్రెస్ నాయకులు గజ్జల కాంతం అన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని, కాని వర్గీకరణ కోసం రేవంత్ రెడ్డి ఒక కమిటీ వేశారన్నది గుర్తించాలన్నారు.అవసరననుకుంటే మరో జ్యుడీషియల్ కమిటీ వేసేందుకు సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.గతంలో మంద కృష్ణ మాదిగ మద్దతు ఇచ్చిన సీఎం లు ఎందుకు సుప్రీం కోర్టులో అడ్వైకెట్లను పెట్టలేదని ప్రశ్నించారు.వర్గీకరణ జరగాలి అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు.కొప్పుల రాజు వర్గీకరణ ను వ్యతిరేకించలేదని చెప్పారు..మంద కృష్ణ వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నామని,ఆయనకు కాంగ్రెస్ విమర్శించే హక్కు లేదన్నారు..2017 నుంచి బీజేపీ కి మద్దతుగా మంద కృష్ణ మాదిగ ఉన్నారు.సుప్రీం కోర్టు తీర్పు అయ్యాక.. కేంద్రం ఎందుకు నోటిఫై చేయలేదని ప్రశ్నించారు..రాష్ట్రాలు సుప్రీం కోర్టు తీర్పు అమలు చేయండి అని ఎందుకు కేంద్రం ఆదేశించడం లేడో అది మంద కృష్ణ చెప్పాలన్నారు..తెలంగాణ లో వర్గీకరణ గురించి అడుగుతున్నారు.. అందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వర్గీకరణ చేస్తామని ఎందుకు చెప్పడం లేదు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావని విమర్శించారు..ఎస్సి వర్గీకరణ ను గ్రూప్స్ లలో.. డీఎస్సీ లో కూడా సీఎం పక్కగా అమలు చేస్తారు.జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేస్తారు.డీఎస్సీ ఆపమని చెప్పడానికి నువ్వు ఎవరు..?వర్గీకరణ కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా కమిటీ వేసింది ఆయన నాయకత్వంలో వర్గీకరణ జరుగుతుంది. పంజాబ్,తమిళనాడు లో వర్గీకరణ అమలు అవుతుంది అని మీరే అంటున్నారు ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు.బీజేపీ నేతలు ఒక్కరూ కూడా వర్గీకరణ మీద ఎందుకు మాట్లాడటం లేదు..బీజేపీ మెప్పు కోసం మంద కృష్ణ మాదిగ మాట్లాడుతున్నారు.ఉద్యోగాల భర్తీ నిరంతర పక్రియా.. వర్గీకరణ ను దానితో ముడిపెట్టడం సరికాదు.వర్గీకరణ కు వ్యతిరేకంగా ఉన్న ఎన్డీయే వైపు నిలబడి.. వర్గీకరణ కు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తున్నారు
Admin
Aakanksha News