ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నల్లగొండ జిల్లా : నల్గొండ జిల్లా మునుగోడు అభ్యర్థిగా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. నేటి నుండి మునుగోడు నియోజకవర్గంలో ప్రచారాలను ముమ్మరం చేయాలని ఎమ్మెల్యేలకు మంత్రులకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆదేశాలను జారీ చేశారు. దీంతో నేటి నుండి మునుగోడు ప్రచారంలో ఎమ్మెల్యేలు మంత్రులు పాల్గొనానున్నారు. అయితే మునుగోడు అభ్యర్థి ఎవరైనా ప్రతి ఒక్కరు సహకరించాలని మంత్రి కేటీఆర్ పార్టీ నాయకులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఆదేశాలను జారీ చేశారు. దీంతో నల్గొండ జిల్లా అసంతృప్తి నేతలతో హైదరాబాద్ ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. 2014 లో మునుగోడు నుంచి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.
Admin
Aakanksha News