Tuesday, 28 July 2026 07:04:54 AM

జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి : టిడబ్ల్యూజేఎఫ్

Date : 03 May 2023 10:25 PM Views : 1224

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించాలని టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మేడ్చల్ జిల్లా ఇంచార్జీ ఎస్కే సలీమా డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలో భాగంగా బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యాలయం ఎదుట నిర్వహించిన దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎస్ కే సలీమా మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం టిడబ్ల్యూజేఎఫ్ నిరంతర పోరాటం చేస్తుందని అన్నారు. మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని విమర్శించారు. జర్నలిస్ట్ సంక్షేమానికి పాటుపడుతూ న్యాయపరమైన డిమాండ్లను అమలు పరచాలని ఆమె డిమాండ్ చేశారు. జర్నలిస్టులు ఎన్నో ఒడుగుదుడుగులను ఎదుర్కొంటూ మీడియా రంగంలో రాణిస్తున్నారని, దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల డిమాండ్లను నెరవేర్చాలని నేషనల్ కౌన్సిల్ నెంబర్ ఎంపల్లి పద్మా రెడ్డి కోరారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ, శాసనసభ్యులకు వినతి పత్రాలు,జిల్లా కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర కౌన్సిలింగ్ సభ్యులు యావపురం రవి,పటేల్ నరసింహ యాదవులు అన్నారు.జర్నలిస్టుల పక్షాన నిలబడి పోరాడుతున్న ఏకైక యూనియన్ టిడబ్ల్యూజెఎఫ్ అని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి మండపాక కళ్యాణ చక్రవర్తి తెలిపారు. జర్నలిస్టు న్యాయమైన కోరికలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన, ఉద్యమ కార్యచరణ ఉంటుందని అన్నారు.ఇంట గెలిచి రచ్చ గెలవాలని,స్థానిక మీడియాను నిర్లక్ష్యం చేస్తూ జాతీయ, అంతర్జాతీయ మీడియాకు పెద్దపీట వేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగదన్నారు. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్ష చేపట్టిన అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి కి వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు , సభ్యులు బెలిదే అశోక్, శివకుమార్, దేవేందర్,విష్ణు మోహన్, ఎన్.శివకుమార్,డేవిడ్ రాజ్,యాట రాజు, వినోద్, సాయిరాజ్,వెంకట్,శ్రీనివాసరావు,నరేష్, రాము, పరుశురాం, నిరంత్,ఉపేందర్,శ్రీను,వినోద్ కుమార్, ముఖేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :