Tuesday, 28 July 2026 08:24:49 AM

కెసిఆర్ తో మరోసారి హరీష్ రావు భేటీ....

Date : 11 June 2025 06:45 AM Views : 1014

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తో మరోసారి హరీష్ రావు భేటీ అయ్యారు. మంగళవారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లిన హరీష్ రావు, కెసిఆర్ తో సమావేశమయ్యారు. రేపు కాళేశ్వరం కమిషన్‌ ముందు కెసిఆర్ హాజరుకానున్నారు. దీంతో కమిషన్‌ ముందు చెప్పాల్సిన అంశాలపై హరీశ్ రావుతో కెసిఆర్ చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా, నిన్న జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు హారీశ్ రావు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. విచారణ తర్వాత నేరుగా ఫామ్ హౌస్ కు వెళ్లిన హరీష్ రావు, కెసిఆర్ తో దాదాపు 5 గంటల పాటు భేటీ అయ్యారు. కాగా, ఈ నెల 6న బిజెపి ఎంపి ఈటల రాజేందర్ ను కమిషన్ విచారించింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :