Tuesday, 28 July 2026 10:47:13 AM

రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏమిటి ...?

ఈ ప్రాజెక్టు గురించి మరింత విశ్లేషణ చేయాలి... కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి

Date : 02 January 2024 09:54 PM Views : 339

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న అవినీతి పట్ల అనేక సార్లు ప్రస్తావించిన నేతలు ఇప్పుడు పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. లక్షకోట్ల రూపాయల అవినీతి ప్రాజెక్టు విషయంలో ఎందుకు సీబీఐ విచారణకు కోరడం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు.ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ కుంగిందన్నారు. అన్నారం ప్రాజెక్టు కూడా గ్యారేంటీ లేకుండా పోయిందన్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఈమేజ్‌ను గోదావరి పాలు చేసిందని ఎద్దేవా చేశారు. అంతేకాదు ఈ ప్రాజెక్టు గురించి మరింత విశ్లేషణ చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ప్రాజెక్టు గురించి 20 అంశాలపైన నేషనల్ డ్యాం సెఫ్టీ అథారిటీ ప్రశ్నలు అడుగగా ప్రభుత్వం మారినా కూడా వివరాలు అందజేయలేదని గుర్తు చేశారు. 20 అంశాలలో 11 అంశాలకే అరకొర సమాధానాలు చెప్పారని వెల్లడించారు.ప్రస్తుత ముఖ్యముంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు మాట్లాడిన అంశాలు ఎందుకు అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి ప్రాజెక్టులు, స్కాంలపై దర్యాప్తు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టిన కోట్లాది రూపాయల గురించి ఎందుకు మరచిపోయారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో నష్టపోయిన పిల్లర్స్ మళ్లీ కడతారా లేదా నేషనల్ డ్యాం సెఫ్టీ అథారిటీ సలహాలు తీసుకుంటారో చెప్పాలని కిషన్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని న్యాయ విచారణ పేరుతో ఆలస్యం చేస్తోందన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :