Tuesday, 28 July 2026 05:14:39 AM

వైయస్సార్ టిపి టికెట్ కోసం ఎర్ర సుమన్ రెడ్డి దరఖాస్తు

Date : 18 October 2023 08:38 PM Views : 668

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్ టిపి పార్టీ టికెట్ కోసం ఎర్ర సుమన్ రెడ్డి హైదరాబాదులోని లోటస్ పాండు లో నీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాం రెడ్డి, సత్యవతి లకు బుధవారం దరఖాస్తు చేసుకున్నాడు. వైయస్సార్ టిపి షర్మిల పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలిపేందుకు తమ పార్టీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరారు. ఈ మేరకు ఎర్ర సుమన్ రెడ్డి పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తూ ఆ పార్టీ కి దరఖాస్తు చేశాడు. పెద్దపల్లి నియోజకవర్గం లో వైయస్సార్ టిపి పార్టీ అధినేత షర్మిల పాదయాత్ర చేసిన సమయంలో ఎర్ర సుమన్ రెడ్డి ప్రధానాపాత్ర పోషించారు..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :