Tuesday, 28 July 2026 08:33:50 AM

తెలంగాణలో ఏక్ పోలీస్ నినాదం....

కొత్తగూడెంలో ఆందోళనకు దిగిన పోలీసు కుటుంబాలు...

Date : 26 October 2024 02:11 PM Views : 491

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ప్రజలకు రక్షణగా నిలిచే పోలీసులకే రక్షణ లేకుండా పోతుంది... తెలంగాణలో పోలీసులే పోలీసులను అరెస్టు చేసే వింత పరిస్థితులు నెలకొంటున్నాయి... తమ కుటుంబాలకు న్యాయం చేయాలని రోడ్డెక్కి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసు కుటుంబాలు చేస్తున్న ఆందోళనలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి... దీంతో పలు జిల్లాలో నిరసన కార్యక్రమాలు ఉదృతంగా కొనసాగుతున్నాయి. కొత్తగూడెం పట్టణంలో ఏఆర్ బెటాలియన్ కానిస్టేబుళ్లకు సెలవు దినం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పోలీస్ కుటుంబాలు పెద్ద ఎత్తున భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.... తెలంగాణలో ఏ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని, ఒకే నోటిఫికేషన్ ఒకే పరీక్ష, ఒకే ఈవెంట్, ఒకే ట్రైనింగ్, ఒకే యూనిఫాం కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే నల్గొండ రూరల్ ఎస్సై పోలీస్ కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో పలు జిల్లాలో పోలీసు కుటుంబాలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు స్థానికంగా ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది.. అయితే న్యాయం కావాలని పోలీసు కుటుంబ సభ్యులు రోడ్డు ఎక్కడంతో అయోమయ పరిస్థితులు నెలకొంటున్నాయి. గత కొన్ని రోజులుగా పోలీస్ కుటుంబాలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు తీవ్రస్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :