Tuesday, 28 July 2026 08:09:13 AM

యువతకు క్రీడలు ఎంతో ముఖ్యం..

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Date : 04 February 2024 01:58 PM Views : 402

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / రంగారెడ్డి జిల్లా : నేటి యువతకు క్రీడలు ఎంతో ముఖ్యమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ నియోజక వర్గం జిల్లేడు చౌదరిగూడెం మండల కేంద్రంలో ఆయన చౌదరిగూడ ప్రీమియం లీగ్ సీజన్4 క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. క్రీడాకారులకు కరాచరణం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల పట్ల యువత మంచి క్రేజ్ సంపాదించుకుంటుందని చెప్పారు. క్రీడల వల్ల శారీరక, మానసిక బలం, ఆత్మస్థైర్యం ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరు అన్ని రంగాల్లో రాణించాలని యువతకు పిలుపునిచ్చారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :