Tuesday, 28 July 2026 04:45:47 AM

చంద్రబాబు ఎమ్మెల్యే అయినప్పుడు.. జగన్ డైపర్లు వేసుకుంటున్నాడు...

షర్మిలపై చెత్త ప్రచారం ఆపకుంటే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు...మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు

Date : 07 February 2024 04:32 PM Views : 397

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : విద్యార్థి దశ నుండే రాజకీయాల పట్ల ఆసక్తితో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయరంగ ప్రవేశం చేసిన మాజీ ఎమ్మెల్యే ఎక్కడ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసిన సంచలన వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో ఆయన పెట్టిన మీడియా సమావేశాలు తీవ్రస్థాయిలో చర్చకు దారి తీయడంతో పాటు ఉద్రిక్త పరిస్థితులు సైతం నెలకొన్న సంఘటనలు ఉన్నాయి. 1983లో పెద్దపల్లి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు గెలిచిన ఆరు నెలలకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతమైన హైదరాబాదులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేయడం తీవ్రస్థాయిలో చర్చకు దారి తీస్తుంది. జగన్ పిరికిపంద అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వలన జగన్ ముగినిపోతున్నారని సంచలన కామెంట్స్ చేశారు. షర్మిలపై చెత్త ప్రచారం ఆపకుంటే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. సజ్జల లాంటి దరిద్రుడి సలహాలతో జగన్‌కు తీవ్ర నష్టం జరగబోతోందన్నారు. టీడీపీ, జనసేన కూటమికి ఏపీలో 151 సీట్లు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఏపీలో జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. ఎన్నికల తర్వాత జగన్ శాసనసభకు కూడా రాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆ దేవుడు కూడా క్షమించడు...

బీజేపీతో పొత్తు వలన.. టీడీపీ, జనసేన కూటమికి బలం పెరుగుతోందన్నారు. చంద్రబాబు చరిత్ర తెలియకుండా జగన్ మట్లాడటం సరైంది కాదన్నారు. 1978లో చంద్రబాబు ఎమ్మెల్యే అయినప్పుడు.. జగన్ డైపర్లు వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మంత్రులు రోజా, విడదల రజనీకి కూడా జగన్ టికెట్ ఇవ్వరన్నారు. కొత్త ఇంచార్జ్‌ల్లో 35 మంది వరకు జగన్ బీఫాం ఇవ్వరన్నారు. తల్లి, చెల్లి పట్ల జగన్ వ్యవహరిస్తోన్న తీరును.. దేవుడు కూడా క్షమించడన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :