Friday, 12 June 2026 12:44:37 AM

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్షన్నర కోట్ల అప్పులు...

బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

Date : 07 March 2025 05:50 PM Views : 848

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం లక్షన్నర కోట్ల అప్పులు చేసిందని, కానీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అయిందని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘాటుగా విమర్శించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ పడిపోవడం పట్ల రేవంత్‌ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామంటారు, అధికారం దక్కాక ఆదాయం కోసం ఎల్ఆర్ఎస్ ముద్దు అంటారని మండిపడ్డారు. హైడ్రా, ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరుతో హైదరాబాద్‌లో అరాచకం సృష్టించారని విమర్శించారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూల్చివేశారని మండిపడ్డారు. ఫలితంగా రిజిస్ట్రేషన్లు పాతాళానికి పడిపోయాని ధ్వజమెత్తారు. ఆదాయం అడుగంటడంతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పారు.అధికారంలోకి వచ్చిన ఏడాదిలో లక్షన్నర కోట్ల అప్పులు చేశారని, హామీల అమలు మాత్రం గాల్లో కలిసిపోయిందని మిమర్శించారు. కాంగ్రెస్ 15 నెలల పాలన నిర్వాకం మూలంగా రియల్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు గారడీలో సామాన్యులే సమిధలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :