Tuesday, 28 July 2026 05:07:39 AM

బాధ్యుల పై కఠినంగా చర్యలు తీసుకోవాలి...

మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్

Date : 03 November 2024 01:56 PM Views : 799

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మంథని : వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించి శిశువు మరణానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు.ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాధిత మహిళలను కలిసి వివరాలు అడిగి తెలుసుకుని వారిని పరామర్శించారు. జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాటారం మండలంలోని దంతాలపల్లి గ్రామానికి చెందిన తోట హరిత గత సోమవారం కాటారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెలివరీ కోసం అడ్మిట్ అవ్వగా డాక్టర్ మౌనిక సాధారణ డెలివరీ అవుతుందని చెప్పి మూడు రోజులు హాస్పిటల్ లో ఉంచి సరైన వైద్యం అందించక పోవడంతో కడుపులో శిశువు చనిపోవడం జరిగిందని అన్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మరణించిందని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులో సరైన వైద్యం అందించడం లేదని ఆరోపించారు. సమస్యలపై స్పందించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, ఈ విషయంపై కలెక్టర్ ,స్థానిక ఎమ్మెల్యే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేనియెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :