Tuesday, 28 July 2026 07:01:44 AM

ప్రజలకు చట్టాలపై అవగాహన ఉండాలి

Date : 04 November 2022 08:17 PM Views : 421

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : ప్రజలకు చట్టాలపై అవగాహన ఉండాలనీ సుల్తానాబాద్ లీగల్ రిటైనర్, న్యాయవాది అవునూరి సత్యనారాయణ అన్నారు.ఆజాదే కా అమృత్ మహోత్సవంలో భాగంగా నల్సా న్యాయ సేవా ఉత్సవాలనుపురస్కరించుకుని శుక్రవారం సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శ్రీరాములపల్లి లో మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజలకు పలు చట్టాలపై అవగాహనకల్పించారు.అక్టోబర్ 31 నుండి చాచా నెహ్రూ జయంతి నవంబర్ 14 వరకు గ్రామగ్రామాన న్యాయ సేవా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. న్యాయవ్యవస్థను ప్రజల వద్దకు తీసుకువెళ్లే ఉద్దేశంతో న్యాయ సహాయం అందించాలనే భావంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది సామల రాజేంద్రప్రసాద్, పారా లీగల్ వాలంటీర్ నల్ల శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :