Friday, 12 June 2026 12:42:30 AM

పెద్దపల్లి జిల్లాలో భర్తను హతమార్చిన భార్య..

Date : 21 October 2022 11:17 AM Views : 997

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : కుటుంబ కలహాలతో భార్య తన భర్తను ఇటుకతో తలపై కొట్టి దారుణంగా హత్య చేసిన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్ షిప్ లోని సర్వెంట్ క్వార్టర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రామగుండం ఎల్కలపల్లి గేటు ప్రాంతానికి చెందిన చిలుముల సుమన్ ఐదేళ్ల క్రితం పొట్యాల గ్రామానికి చెందిన స్పందన అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఇద్దరికీ మొదటిసారిగా పెళ్లిళ్లు జరిగాయి. ఇద్దరికీ సంబంధించి రెండో పెళ్లి కావడం వల్ల తరచూ ఇంట్లో గొడవలు చోటు చేసుకుంటున్నాయి.ఆటో నడుపుకుంటూ ఉండే సుమన్ తన భార్య స్పందన ఎన్టీపీసీ టౌన్ షిప్ ఉద్యోగుల నివాసాల్లో పనిచేస్తూ ఉండేది. ఈ క్రమంలోనే ఈరోజు తెల్లవారు జామున భార్యా భర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. తన భర్త వేధింపులు భరించలేక అక్కడే ఉన్న ఇటుకతో సుమన్ తలపై కొట్టి చంపింది. సుమన్ అక్కడికక్కడే ఇంటిలో పడి విగత జీవిగా మారాడు. సంఘటన స్థలాన్ని రామండం ఎన్టీపీసీ పోలీసులు పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితురాలు స్పందనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :