Sunday, 26 April 2026 05:56:00 PM

లిక్కర్ స్కాంపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగులపై లేదా..❓

నిరుద్యోగుల జీవితాల్లో చీకటిని నిప్పుతున్న ప్రభుత్వం..

Date : 18 March 2023 11:45 AM Views : 521

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని పీడీఎస్ యూ జాతీయ నాయకులు జూపాక శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... TSPSC నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని అన్నారు. వెంటనే TSPSCని రద్దుచేసి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో స్పందించిన మంత్రులు, ఎమ్మెల్యేలు TSPSC విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.లిక్కర్ స్కాంపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగులు, విద్యార్థులపై లేదా అని ప్రశ్నించారు. వెంటనే TSPSC పేపర్ లీకేజీలపై ప్రభుత్వం, ఎమ్మెల్యేలు మంత్రులు స్పందించకపోతే వారి ఇండ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థుల కోసం ఏర్పడిన TSPSC వెంటనే రద్దు చేయాలని దీనికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.అలాగే TSPSC నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :