Tuesday, 28 July 2026 09:33:47 AM

ఇందిరమ్మ ఇళ్ల పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి...

అరుగులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాలి.... బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

Date : 30 January 2025 04:57 PM Views : 424

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నిర్మల్ జిల్లా : అర్హులైన నిరుపేదలందరికి సంక్షేమ పథకాలు అందజేయాలి అని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలు పరచడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జిల్లాలో ఇల్లు లేని పేదలు 1లక్ష 90వేల దరఖాస్తులు వస్తే నియోజక వర్గం నుండి సుమారు 70 వెలకు పైగా దరఖాస్తులు వస్తె కేవలం 3500 ఇల్లు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. అర్హులను ఎలా గుర్తిస్తారు, దానికి సంబంధించిన పూర్తి ప్రణాలికను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది, రేషన్ కార్డు జారీలపై కూడా స్పష్టత ఇవ్వాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :