ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ప్రజల రక్షణ కోసమే పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించడం జరుగుతుందని గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుంటపల్లిలో వన్ టౌన్ సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ చేపట్టారు. కాలనీలోని ఇంటింటికి తిరుగుతూ సోదాలు చేశారు. ఇందులో భాగంగా సరైన ధృవపత్రాలు, నెంబర్ ప్లేట్ లేని 48 ద్విచక్ర వాహనాలతో పాటు 3 ఆటో ట్రాలీలు, 1కారును స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ తెలిపారు. అపరిచిత వ్యక్తులు తరస పడితే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని కాలనీ ప్రజలకు సూచించారు. అలాగే ప్రతి ఏరియాలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ అన్నారు. ఈ మధ్యకాలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రజలు ఎవరు విలువైన వస్తువులు డబ్బులను ఇంట్లో ఉంచుకోరాదని, ఊరికి వెళ్లే సమయంలో పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని, రామగుండం సిఐ లతోపాటు సుమారు 100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Aakanksha News