Tuesday, 28 July 2026 08:13:56 AM

ప్రదాని నరేంద్ర మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ ప్లకాడ్స్ తో నిరసన...

Date : 11 November 2022 11:31 PM Views : 395

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : కార్మిక వ్యతిరేక,కార్పొరేట్ కు అనుకల విధానాలు అమలు చేస్తున్న దేశ ప్రధాని మోడీ పెద్దపెల్లి జిల్లా RFCL ప్రారంభోత్సవం పర్యటనను వ్యతిరేకించాలని గోదావరిఖని లో మోడీ గో బ్యాక్ నినాదాల తో కూడిన ప్లకాడ్స్ తో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో HMS ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్,IFTU రాష్ట్ర అధ్యక్షులు టీ శ్రీనివాస్, (IFTU ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ,GLBKS (IFTU ) రాష్ట్ర నాయకులు ఈ రాజేందర్ లు మాట్లాడుతూ దేశంలో బొగ్గు పరిశ్రమను వేలంలోకి తీసుకువచ్చి కార్పొరేట్ అధిపతి ఆదాని అంబానీలకు అప్పజెపుతున్నాడని విమర్శించారు. బొగ్గు పరిశ్రమలో 11వ వేతన ఒప్పందం సంవత్సరం దాటుతున్న కాలంగా పెండింగ్ లో ఉందని ఇప్పటికి 7 ధపాలుగా జరిగిన చర్చలలో ఎలాంటి పురోగతి లేదని మూడు శాతం కంటే ఎక్కువ పెంచేది లేదని కరాకండిగా చెబుతున్నారని మండిపడ్డారు. బొగ్గు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తు గని కార్మికుల వేతన ఒప్పందం ముందుకు సాగకుండా బిజెపి ప్రభుత్వ విధానాలు ఉన్నాయని అందుకే మోడీ పర్యటనను వ్యతిరేకించాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీగా కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.మోడీ విధానాల ఫలితంగా నేడు 5 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయని ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు పెరగటం తప్ప తరగ టం లేదని 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్స్ గా తీసుకువచ్చారని వీటిని అమలు జరపమని రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తున్నారని అన్నారు సంవత్సరానికి 2 కోటి ఉద్యోగాలు కాదు కదా కోట్లాదిమంది ఉద్యోగులు నిరుద్యోగులుగా మారుతున్నారని ప్రజలపై జిఎస్టి భారం హక్కులపై దాడి ప్రశ్నించిన వారిపై దేశభక్తి పేరుతో దేశాన్ని ప్రేమిస్తున్న ప్రజలను మేధావులను రచయితలను కవులను జర్నలిస్టులను మీడియాపై కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన దాడి చేస్తుందన్నారు. మోడీ పర్యటనను సింగరేణి గడ్డపై ఉన్న కార్మిక వర్గం వ్యతిరేకించాలని మోడీ విధానాలను ప్రశ్నిస్తూ ప్లకాడ్స్ తో మోడీ పర్యటనను నిరసిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో HMS నుండి రాజేశ్వరరావు,దావు రమేష్, TGLBKS (IFTU) నుండి ఈ నరేష్, చిలుక శంకర్, ఎం దుర్గయ్య, ఐ సాంబయ్య,కె మొగలి, GLBKS-IFTU నుండి గుండేటి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :