Tuesday, 28 July 2026 04:17:29 AM

స్టార్ మా సరికొత్త సీరియల్"నువ్వుంటే నా జతగా"...

Date : 14 December 2024 05:20 PM Views : 652

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : స్టార్ మా సపరివారంలో సరికొత్తగా ఒక సీరియల్ వచ్చి చేరుతోంది. పేరు "నువ్వుంటే నా జతగా". మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగినట్టుగా ఇంట్లో అందరికీ నచ్చేలా భిన్నమైన అంశాలను అందించడం స్టార్ మా ప్రత్యేకత. ఈసారి అందిస్తున్న కథ ప్రతి తరాన్నీ కనెక్ట్ చేయబోతోంది "నువ్వుంటే నా జతగా". ప్రేమతో సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ ఉండదని రుజువు చేయడానికి వస్తున్న కథ ఇది. ఈ కథ అనుబంధానికి ఓ కొత్త నిర్వచనం. ప్రేమకి ఓ విలక్షణమైన వివరణ. సంప్రదాయానికి, సంస్కృతికి ఎంతో విలువ ఇచ్చే ఒక అమ్మాయికి; గాలికి తిరిగే కుర్రాడికి మధ్య ఒక అనుకోని మూడుముళ్ల బంధం ఈ కథకి మూలం. ఈ నెల16 నుంచి.. రాత్రి 9.30 గంటలకు ఈ ధారావాహిక ప్రారంభం కాబోతోంది. ప్రేమ ఉన్నచోట కోపం ఉంటుందనే ఒక ప్రాథమిక సూత్రానికి, ప్రేమ ఉంటే తప్పుని దిద్దాల్సిన బాధ్యత కూడా ఉంటుందనే మౌలికమైన ఆదర్శాన్ని "నువ్వుంటే నా జతగా" సీరియల్ కథ చూపించబోతోంది.దానికి దృశ్యరూపమే "నువ్వుంటే నా జతగా" సీరియల్. ఈ నెల16 నుంచి.. రాత్రి 9.30 గంటలకు ఈ ధారావాహిక ప్రారంభం అవుతోంది. మిస్ అవ్వకండి. మీరు చూడండి. మీ వాళ్ళు అందరినీ చూడమని చెప్పండి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :